ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రభాస్ నాయక్ జన్మదిన వేడుకలను భాజపా నాయకులు ఘనంగా నిర్వహించారు.
కురవి, చిన్నగూడూరు, నర్సింహులపేట మండల కేంద్రాల్లో ఆయన జన్మదినోత్సవ వేడుకలకు భాజపా ముఖ్య నాయకులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
నర్సింహులపేట మండలంలోని లాలితండకు చెందిన సుమారు 20 మంది వివిధ పార్టీల నుంచి ప్రభాస్ నాయక్ ఆధ్వర్యంలో బిజెపిలో చేరిన నాయకులకు, బిజెపి జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ కండువాగప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రామచంద్రరావు
మాట్లాడుతూ.. డోర్నకల్ లో బిజెపి పార్టీ బలోపేతానికి ప్రభాస్ నాయక్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.
పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభాస్ నాయక్ ను అభినందించారు. ప్రభాస్ నాయక్ మాట్లాడుతూ.. డోర్నకల్ లో బిజెపి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. చాలా మంది బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బిజెపిలో చేరడానికి రెడిగా వున్నారని, కానీ సమయం వచ్చినపుడు బిజెపిలో చేరడానికి చాలామంది సిద్దంగా వున్నారన్నారు. రాజకీయ నాయకులకు భవిష్యత్ పై భరోసా బిజెపితోనే దక్కుతుందని అన్నారు. ప్రధాని మోడీ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పెంటయ్య, చిన్న గూడూరు బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బోయిని యాకన్న, డోర్నకల్ మండల అధ్యక్షుడు నగేష్, కురవి మండల అధ్యక్షుడు నాగరాజు, నర్సింహులపేట మండల ప్రధాన కార్యదర్శి మైదం సురేష్, బిజెపి నాయకులు గణేష్, దేవా, వాసు, రెడ్డి, వివిధ మండలాల బీజేవైఎం కార్యకర్తలు, బీజేవైఎం నాయకులు బ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.
