ఇటీవల స్థానిక మాజీ ఎంపీటీసీ సతీష్ తల్లి రాములమ్మ ను ,సర్పంచ్ గా నామినేషన్ వేయాలంటూ కాళ్లపై పడి వేడుకున్న ఓ ఓటరు.
గ్రామ ప్రజల ఒత్తిడికి తలొగ్గిన రాములమ్మ.
మద్దతుదారులతో కలిసి నేడు నామినేషన్ దాఖలు చేసిన రాములమ్మ.
నామినేషన్ కు గల్లగురిగి(కిడ్డి బ్యాంక్) పగులకొట్టి డబ్బులను ' విరాళం'గా ఇచ్చిన రాములమ్మ మనవరాళ్లు.
(నమస్తే న్యూస్, డిసెంబర్ 01,దంతాలపల్లి)
దాట్ల గ్రామ రాజకీయాల్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఇటీవల స్థానిక మాజీ ఎంపీటీసీ కొమ్మినేని సతీష్ తల్లి రాములమ్మను సర్పంచ్ అభ్యర్థిగా నిలవాలంటూ ఓ ఓటరు ఆమె కాళ్లపై పడి వేడుకున్న సంఘటన గ్రామమంతా చర్చనీయాంశమై మారింది. “గ్రామానికి మార్పు కావాలి… మా ఊరికి మీ నాయకత్వం అవసరం” అంటూ గ్రామస్తులు నిరంతర ఒత్తిడి చేయడంతో ఆడపడుచుల గ్రూపులు, యువకులు, కాంగ్రెస్ శ్రేణులు అన్నీ ఒకే స్వరంతో నిలబడ్డాయి.
ఈ ప్రజాభిలాషకు చివరకు తలొగ్గిన రాములమ్మ అభిమానులు,శ్రేయోభిలాషులు ,కార్యకర్తలతో కలిసి , కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నేడు అధికారికంగా సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద ఆమెకు స్వాగతం పలికేందుకు ఊరంతా తరలి వచ్చి, ప్రజలు హర్షధ్వానాలు చేశారు.ఇదిలా ఉండగా మేము నిరుపేదలమని ఎన్నికల్లో పోటీ చేయలేమని ఓ సందర్భంలో మాట్లాడిన రాములమ్మ మాటలను విన్న ఇద్దరు చిన్నారులు నామినేషన్‌కు కావాల్సిన ఖర్చులకు గల్లగురిగి (కిడ్డీ బ్యాంక్) పగులకొట్టి అందులో ఉన్న డబ్బులను ‘విరాళం’గా రాములమ్మ మనవరాళ్లు ఇవ్వడం గ్రామ ప్రజల్ని కదిలించింది. “మన నానమ్మ సర్పంచ్ కావాలి… మా ఊరు బాగుపడాలి” అనే చిన్నారి మాటలు అక్కడున్న వారిని మరింత భావోద్వేగానికి గురిచేశాయి.
రాములమ్మ నామినేషన్‌తో దాట్ల గ్రామంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గ్రామ అభివృద్ధి, మహిళా నాయకత్వం, ప్రజల ఆకాంక్షల మేళవింపుగా ఈ ఎన్నికలకు ప్రత్యేక గుర్తింపు సంతరించుకోనుంది.
![]() |
| రాములమ్మ నామినేషన్ కు విరాళాన్ని అందిస్తున్న చిన్నారులు |



