నర్సింహులపేట మండల కేంద్రంలోని కపిలగిరి కొండపై వెలసిన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి గుట్టపైకి భక్తుల సౌకర్యార్థం ఘాటు రోడ్డు నిర్మాణం కోసం రూ. కోటి 20 లక్షలు నిధులు మంజూరు చేసిన సందర్భంగా శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి దేవాలయ శాశ్వత దాత శ్రీ నూకల గౌతంరెడ్డి ఆధ్వర్యంలో సేవా సమితి బృందం శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాయం లేకుండా ఇక్కట్లు పడుతున్న అర్చకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలవాలనే ఉద్దేశంతో ధూప దీప నైవేద్య పథకం తీసుకువచ్చి వారిని ఆదుకుంటున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ బొల్లం రమేష్,బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండబత్తిని జగదీశ్వర్,బృందం సభ్యులు బండి రమేష్,వీరూ నాయక్,ప్రేమ్ కుమార్,మంచాల శ్రీశైలం,శేషు కుమార్,ఎరనాగి వెంకన్న,నిదానపురం సర్పంచ్ పెండ్యాల నరేష్,అలువాల కుమార్, సోమన్న,యాకన్న తదితరులు ఉన్నారు.
