చిన్నగూడూరు మండలంలోని గుండంరాజుపెల్లి ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా 10లక్షల రూ.ల వ్యయంతో నిర్మించిన తరగతిగదులను ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రారంభించారు.
అనంతరం తరగతిగదిలోకి వెళ్ళి విద్యార్థుల సీట్ల లో కూర్చున్నారు.అనంతరం బోర్డుపై పాఠాలు చెప్పి విద్యార్థులను ఉత్తేజ పరిచారు.
నిత్యం ప్రజా సమస్యల పరిష్కారంలో తలా మునకలయ్యి ,అహోరాత్రులు డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తున్న ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ పిల్లలకు పాఠాలు చెప్పే విద్యార్థులను వుత్తేజ పరిచడంతో విద్యార్థులు,ప్రజాప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
