భూపాల్ నాయక్ ఆశీర్వాదంతో మీ సేవకుడిగా కొనసాగుతా..!
గెలిపిస్తే అభివృద్ధి చేస్తా... హామీలు నెరవేర్చకపోతే స్వయంగా దిగిపోతా”
గ్రామ అభివృద్ధికి ఐదు హామీలతో సమరానికి స్వతంత్ర అభ్యర్థి గణేష్.
(నమస్తే న్యూస్,నవంబర్ 29,నర్సింహులపేట)
గ్రామ అభివృద్ధే లక్ష్యంగా స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి చెలిమిల్ల గణేష్ ప్రజల ముందుకు వచ్చారు. ప్రజలు అవకాశం ఇస్తే ఏడాదిలోపే అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని, చేయలేకపోతే స్వయంగా రాజీనామా చేస్తానని ఆయన నర్సింహులపేట పంచాయతీ ప్రజలకు హామీ ఇచ్చారు.
గణేష్ ప్రకటించిన ప్రధాన హామీలలో విద్యార్థుల కోసం శాశ్వత గ్రంథాలయం ఏర్పాటు కీలకం. గ్రామంలోని పాఠశాల– పోటీ పరీక్షలకు ప్రీపేర్ అయ్యే అభ్యర్థులకు ప్రశాంత వాతావరణంలో చదివేలా ఆధునిక లైబ్రరీను ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు.అలాగే నిరుపేదల ఆత్మ గౌరవం కాపాడేలా గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్మశాన వాటిక అభివృద్ధితో పాటు ఆధునిక అంతిమ యాత్ర రథం అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు.ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు చేరడమే లక్ష్యంగా ఉచిత తాగునీటి కోసం వాటర్ ప్లాంట్ ఏర్పాటు కూడా గణేష్ హామీల్లో ఒకటి.అత్యవసర సమయంలో జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన ఇబ్బంది లేకుండా, మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి నీ బలోపేతం,అవసరమైన వసతుల ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.గ్రామం లోని యువత ఆరోగ్యకర జీవనానికి దోహదం చేసేలా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్థానని,అభిరుచికి తగ్గ క్రీడల్లో ప్రోత్సహించేందుకు క్రీడల్లో నిపుణులచే శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయిస్తానని నిర్ణయించుకున్నారు. చెడు వ్యసనాలకు దూరంగా యువత ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
“గెలిపిస్తే అభివృద్ధి చేస్తా... హామీలు నెరవేర్చకపోతే స్వయంగా దిగిపోతా” అంటూ గణేష్ ప్రజల మద్దతు కోరారు. స్వతంత్రంగా, నిజాయితీగా ప్రజాసేవ చేయడం ఒక్కటే తన ధ్యేయమని, గ్రామ అభివృద్ధి కోసం తమను గెలిపించాలని ఆయన కోరారు.


