కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరిన కార్యకర్తలు.
రెడ్యా నాయక్ పాలనలోనే నియోజకవర్గం అభివృద్ధి.
-భూతం రామారావు.
(నమస్తే న్యూస్ ,దంతాలపల్లి,డిసెంబర్ 1) దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, సేను రాజేష్,వీరబోయిన కిషోర్ ల ఆధ్వర్యంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూతం రామారావు,భూతం కృష్ణ,అల్లం శ్రీను,తూర్పాటి శంకర్,భూతం సింహాద్రి,కిన్నెర సాయితో పాటు 20 మంది కార్యకర్తలు ఉన్నారు.ఈ సందర్భంగా భూతం రామారావు మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డిఎస్ రెడ్యానాయక్ మీద అభిమానంతో బిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయిని శ్రీనివాస్ రెడ్డి,ఎల్లు కృష్ణారెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు.

