గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తా..!
గతంలో గ్రామం కోసం ఎంతో చేశాం.
దంతాలపల్లి సర్పంచ్ అభ్యర్థి ఎల్లు శ్రీనివాస్ రెడ్డి .
(నమస్తే న్యూస్ ,దంతాలపల్లి,డిసెంబర్ 3 ) దంతాలపల్లి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, గతంలో గ్రామం కోసం ఎంతో చేశామని జనరల్ స్థానంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నానని ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా అని సర్పంచ్ అభ్యర్థి ఎల్లు శ్రీనివాసరెడ్డి అన్నారు.బుదవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గతంలో మా తండ్రి ఎల్లు చిన్న వీరారెడ్డి గ్రామంలో విద్యుత్ సబ్ స్టెయిన్,బస్టాండ్,పాఠశాల,ఎస్సీ కాలనీకి భూదానం చేశాడు.తను పుట్టిన ఊరును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తాను ఉన్నంతకాలం కృషి చేశాడని, వీరారెడ్డి వారసునిగా దంతాలపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సర్పంచ్ బరిలో ఉన్నానని, ప్రజలు ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.కార్యక్రమంలో సీతారాం రెడ్డి,బిక్షం రెడ్డి, సతీష్ రెడ్డి,కొరిపల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

