రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అసోసియేట్ జాయింట్ సెక్రటరీగా తోట సురేష్ నియామకం
నర్సింహులపేట మండల వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న హర్షాతిరేకాలు.
![]() |
| నియామకపత్రం అందిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు కాసాని వీరేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్ |
(నమస్తే న్యూస్, డిసెంబర్ 01,నర్సింహులపేట)
తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అభివృద్ధికి చేసిన సేవలను గుర్తిస్తూ… మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామానికి చెందిన జాతీయ మాజీ క్రీడాకారుడు తోట సురేష్ ను రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అసోసియేట్ జాయింట్ సెక్రటరీగా నియమించింది. క్రీడా రంగంలో ఆయన చేసిన కృషి, కబడ్డీ ప్రోత్సాహానికి చేసిన సేవలను పరిశీలించిన అనంతరం అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ సందర్భంగా తోట సురేష్ మాట్లాడుతూ నన్ను ఈ బాధ్యతకు ఎంపిక చేసిన రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ పెద్దలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు కాసాని వీరేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు. కబడ్డీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు.కాగా మారుమూల గ్రామం నుండి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సురేష్ ను జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులు,అభిమానులు అభినందిస్తున్నారు.

