రాష్ట్ర మంతటా టికెట్ కోసం పోరాటం చేస్తున్న అభ్యర్థులు.…!
దాట్లలో మాత్రం ‘నువ్వే నామినేషన్ వేయాలంటూ’ ఓటర్ల ఆందోళన..!
నామినేషన్ వేయాలంటూ మహిళ కాళ్లను పట్టుకుని ప్రాదేయపడిన ఓటరు.
![]() |
| మహిళ కాళ్లను పట్టుకుని ప్రాదేయపడుతున్న ఓటరు |
(నమస్తే న్యూస్,దాట్ల, నవంబర్ 30)
తెలంగాణలో చాలాచోట్ల గ్రామ సర్పంచ్ టికెట్లు దక్కించుకోవడానికి ఆసక్తి ఉన్న పలువురు పార్టీ నేతలు, అభ్యర్థులు నెలల తరబడి తిరుగుతూ, అగ్రనేతల వద్ద వరుసగా పలుకరింపులు చేస్తూ, ఎక్కడైనా అవకాశం వస్తుందేమో అని నానా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈ పరిస్థితులకు పూర్తి విరుద్ధంగా దాట్ల గ్రామంలో మాత్రం “నువ్వే మా సర్పంచ్ అభ్యర్థి కావాలి” అంటూ స్థానిక ప్రజలు ఓ మహిళను కాళ్లపై పడి ఒత్తిడి చేయడం రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది.
యువ నాయకుడు మాజీ ఎంపీటీసీ కొమ్మినేని సతీష్ పై గ్రామ కాంగ్రెస్ శ్రేణులు, మద్దతుదారులు, శ్రేయోభిలాషులు ఒత్తిడి చేయడంతో పరిస్థితి గ్రామమంతా చర్చనీయాంశమైంది. సర్పంచ్ పదవి జనరల్ ఉమెన్ గా రిజర్వ్ కావడంతో, సిట్టింగ్ ఎంపీటీసీ సతీష్ తల్లి నే బరిలో నిలపాలని గ్రామ మహిళలు, యువకులు, పెద్దలు ఒకే స్వరంతో కోరుతున్నారు.“గ్రామం మారాలంటే మనమే నాయకుడిని ఎంచుకోవాలనీ… సేవ చేసిన వారికే అవకాశం ఇవ్వాలి” అని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సతీష్ ఇంటి ముందు ప్రజలతో చర్చిస్తుండగా ,సతీష్ తల్లి పాదాలను పట్టుకొని మీరే పోటీలో ఉండాలని ,తాము గెలిపించుకుంటామని ప్రాధేయపడ్డాడు. ఈ దృశ్యం గ్రామ రాజకీయాలకు కొత్త మలుపు తెచ్చింది.
సర్వత్రా నాయకులు టికెట్ కోసం తాపత్రయపడే రోజుల్లో… దాట్లలో మాత్రం ప్రజలే నాయకుడిని కోరుకుంటూ ముందుకొస్తున్న అరుదైన పరిస్థితి నెలకొనడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలపై స్పందించిన సతీష్… “గ్రామ ప్రజల అభిప్రాయం నాకు శిరోధార్యమని,అందరి మాట విని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.


