బిఆర్ఎస్ లో చేరిన మున్నూరు కాపు యువజన నాయకులు.
![]() |
| యువజన నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న మాజీ మంత్రి డి.ఎస్.ఆర్. |
రిపోర్టర్: పడిదం నరేందర్
(నమస్తే న్యూస్,దంతాలపల్లి,డిసెంబర్ 2 )
బిఆర్ఎస్ దంతాలపల్లి గ్రామ శాఖ ఆధ్వర్యంలో దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన మున్నూరు కాపు ముద్దుబిడ్డ కాంగ్రెస్ నిక్కారసైన యువనేత కందుకూరి మహేష్,టీం బిఆర్ఎస్ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఆయనతో పాటు మండల కేంద్రానికి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం మహేష్ గారు మాట్లాడుతూ నిజాయితీగా నిబద్ధతతో కట్టుబడి పార్టీలో పని చేసిన మాకు నేడు కాంగ్రెస్ పార్టీలో సరియైన గుర్తింపు లేక పోవడం చాలా బాధాకరం అన్నాడు. దంతాలపల్లి గ్రామ అభివృద్ధికి కోసం కెసిఆర్ అభివృద్ధి పనులను చూసి బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తానని,ఈ చేరికకు సహకరించిన బిఆర్ఎస్ దంతాలపల్లి నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు.సేను రాజేష్, వీరబోయిన కిషోర్ తదితరులు పాల్గొన్నారు .

