సర్పంచిగా నన్ను గెలిపిస్తే దంతాలపల్లి గ్రామ అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా:
కాంగ్రెస్ అభ్యర్థి పొన్నోటి బాలాజీ
దంతాలపల్లి గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థి మేనిఫెస్టో విడుదల.
(నమస్తే న్యూస్ ,దంతాలపల్లి, డిసెంబర్ 01)
దంతాలపల్లి మండల కేంద్రంలో సోమవారము కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పొన్నోటి బాలాజీ నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన అనంతరం సర్పంచ్ అభ్యర్థి బాలాజీ మాట్లాడుతూ సర్పంచిగా నన్ను గెలిపిస్తే దంతాలపల్లి గ్రామ అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని అన్నారు. దంతాలపల్లి మండల కేంద్రంలో రైతులు కోతుల బెడద తో బాధపడుతున్న సందర్భంగా గెలిచిన వెంటనే కోతుల నివారణ చర్య తీసుకుంటానని అన్నారు.దంతాలపల్లి మండలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు, సైడ్ కాలవలు,సిసి రోడ్ల నిర్మాణం, గ్రామ ఆడపడుచుల కోసం బతుకమ్మ ఘాట్,వైకుంఠధామం లో సోలార్ లైట్లు, యువతకు ఇండోర్ స్టేడియం మరియు ఓపెన్ జిమ్ లాంటి అభివృద్ధి పనులు చేస్తానని దంతాలపల్లి గ్రామ అభివృద్ధి మేనిఫెస్టో విడుదల చేశారు. అవసరమైతే డోర్నకల్ ఎమ్మెల్యే సహకారంతో దంతాలపల్లి మండల కేంద్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమములో మాజీ ఎంపీటీసీ నెమ్మది యాకయ్య, మండల కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు కోరబోయిన గీర్వాణి,మాజీ ఉపసర్పంచ్ బొల్లు వీరన్న,కాంగ్రెస్ కార్యకర్తలు సోమారపు నెహ్రూ,నెమ్మది రామకృష్ణ,పులుగుజ్జ ఉప్పలయ్య,పులుగుజ్జ కృష్ణ,దర్శనాల అశోక్,దాసరి సోమయ్య,దాసరి సందీప్,నెమ్మది వెంకటేశ్వర్లు,జాటోత్ సుక్య,రొయ్యల అనంతమ్మ,గంధం శశికళ,దిగజర్ల పారిజాతమ్మ,కందగట్ల వెంకన్న,నరుకుట్టి సీతారాములు,అంకం సతీష్,నెల్లూరి రవి,దాసరి సోమయ్య,పొన్నొటి ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

