ప్రజలు ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా..!
పెద్దముప్పారం గ్రామ స్వతంత్ర అభ్యర్థి కందిమల్ల భరత్ బాబు.
(నమస్తే న్యూస్,దంతాలపల్లి, డిసెంబర్ 1)
ప్రజలు ఆశీర్వదిస్తే ,సర్పంచ్ గా గ్రామ అభివృద్ధి కి కృషి చేస్తానని,30 ఏళ్ల తరువాత రిజర్వేషన్ వచ్చిందని ,ప్రజలు ఓటువేసి గెలిపించాలని భారత్ బాబు ప్రజలను వేడుకున్నారు.మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం గ్రామ సర్పంచ్ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా కందిమల్ల భరత్ బాబు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం మా నాన్న కందిమల్ల అశోక్ బాబు గ్రామ సర్పంచిగా ఎన్నుకోబడి గ్రామాభివృద్ధికి కృషి చేశాడని, గ్రామంలో ప్రధాన సమస్య అయిన త్రాగునీటి సమస్యను తీర్చాడని, ముప్పై సంవత్సరాల తర్వాత బీసీ రిజర్వేషన్ వచ్చిందని కందిమల్ల అశోక్ బాబు ఆశయాలను నెరవేర్చడానికి, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ఒకసారి ఆశీర్వదించి సర్పంచిగా గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తానని కందిమల్ల భరత్ బాబు గ్రామస్తులను కోరారు. కార్యక్రమంలో మార్త నాగార్జున, మిడతపల్లి వెంకన్న,నట్టి వెంకటేశ్వర్లు,పోలేపల్లి రమణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

