ప్రజలకు పథకాలు ఇచ్చి కమీషన్లు వసూలు చేస్తున్న ఎంపీ,ఎమ్మెల్యే.
ప్రశ్నించినోళ్లపై అక్రమ కేసులు..
3ఎకరాలున్న కుటుంబం నుంచి వచ్చి నిస్వార్థంగా పని చేస్తే వందల కోట్లు ఎట్లా వచ్చాయ్.
ఎమ్మేల్యే రెడ్యానాయక్.. ఎంపీ కవితపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ రామచందర్ నాయక్ ధ్వజం.
(నమస్తే మానుకోట-నర్సింహులపేట)
ప్రభుత్వ పథకాలు ప్రజల పేరుతో పంపిణీ చేస్తూ దళారులతో ఎంపీ కవిత..ఎమ్మెల్యే రెడ్యానాయక్ డోర్నకల్ నియోజకవర్గంలో లక్షల రూపాయలు వసూలు చేస్తూన్నారని రామచందర్ నాయక్ ఆరోపించారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్ కమీషన్ల కోసమే కార్యకర్తలకు పథకాలు ఇప్పిస్తున్నారని అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండల కేంద్రంలో పీఏసీఎస్ డైరెక్టర్ పోలేపలి రజినీకాంత్ రెడ్డి నూతన గృహ ప్రవేశం సందర్భంగా వచ్చి అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడెకరాల భూమి ఉన్న నిరుపేద కుటుంబంలో పుట్టిన ఎమ్మెల్యేకు ఈ రోజువందల కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చాయని ప్రశ్నించారు.నియోజికవర్గంలో ప్రభుత్వ పథకాలను బీఆర్ఎస్ లీడర్లుకు మాత్రమే తీసుకుంటున్నారని,డోర్నకల్ లో ఇసుక దందాతో పాటు అన్నిరకాల దందాలు రెడ్యానాయక్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని చెప్పారు.నియోజికవర్గంలో జరుగుతున్న అన్యాయలపై ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని గత 40 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ,కార్యకర్తలు భుజాలపై మొస్తే అలాంటి కార్యకర్తలపై కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నుండి మొదలుకొని నేటి గృహలక్ష్మీ పథకం వరకు ఇంటిటింకి వసూళ్లకు పాల్పడిన పందికొక్కులు ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను సమర్దిస్తున్నారన్నారు. డోర్నకల్ ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాలంటే ఎమ్మెల్యేతో పాటు సీఎంను రాజకీయంగా బొంద పెడ్తే తప్ప పథకాలు రావని తేల్చి చెప్పారు.మార్పు,స్వేచ్ఛ కోసం నియోజికవర్గ ప్రజలు మేల్కోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్, పీఏసీఎస్ డైరెక్టర్ రజినీకాంత్ రెడ్డి, వెన్నం రవీందర్ రెడ్డి, ఎస్టీ సెల్ మండలాధ్యక్షులు దస్రు నాయక్, ఎరనారి రమేష్, కొండ్రెడ్డి కరుణాకర్ రెడ్డి, గౌని యాదగిరి, దోమల యాదగిరి గౌడ్ , పోలేపల్లి నారాయణరెడ్డి పాల్గొన్నారు.
