ఎమ్మెల్యే రెడ్యానాయక్ ని విమర్శించే స్థాయి డా.రాంచంద్రనాయక్ కు లేదు-బిఆరెస్ యూత్ మండల ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీశైలం.
September 10, 2023
0
ఎమ్మెల్యే రెడ్యానాయక్ ని విమర్శించే స్థాయి డా.రాంచంద్రనాయక్ కు లేదని నర్సింహులపేట మండల బిఆరెస్ యూత్ ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీశైలం అన్నారు. ఈ సందర్భంగా పడమటిగూడెం గ్రామంలో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ, ఇటీవల నర్సింహులపేట మండల కేంద్రంలో జరిగిన ఒక ఫంక్షన్లో కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గం అభ్యర్థి రామచంద్రనాయక్ మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా, విడ్డూరంగా ఉన్నాయని,బడుగు బలహీన వర్గాల గుండెచప్పుడు , డోర్నకల్ నియోజకవర్గ అభివృద్దే ప్రధాన లక్ష్యంగా మా నాయకుడు రెడ్యా నాయక్ పనిచేస్తున్నారని, గత 30 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలకు పగలనకా ,రాత్రనకా ఆపదలో ప్పరజలకు ఆద్బాంధవుడిగా అండగా ఉండి , పుట్టిపెరిగిన మారుమూల గిరిజన తండాలోనే నివసిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 24 గంటలు 365 రోజులు కార్యకర్తలకు అందుబాటులో ఉండే ఏకైక నాయకుడు రెడ్యానాయక్ అనీ ,కనీసం కార్యకర్తలను పట్టించుకోని తమకు ఏం తెలుసునని మండి పడ్డారు. వివిధ ప్రభుత్వ పథకాలైన దళిత బంధు, బీసీ బందు, రైతు బంధు, రైతు భీమా, సీఎంఆరెఫ్ చెక్కులు,గృహలక్ష్మి పథకంలో ఇండ్ల మంజూరీ తదితర పథకాలు అన్నిపార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు రైతులకు,సబ్బండ వర్గాల ప్రజలకు అందే విధంగా కృషి చేస్తున్నాడని,ఆపదలో ఉన్న ఎంతో మంది మీ పార్టీ కార్యకర్తలను సైతం ఆదుకున్న తీరు కనిపించడంలేదా అనీ ప్రశ్నించారు.అలాంటి మా నాయకుడిని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మా యొక్క సోదరీమణి మహబూబాబాద్ ఎంపీ కవితమ్మ ను , మా నాయకుడు రెడ్యా నాయక్ ను ఉద్దేశించి ఏమి అభివృద్ధి చేయలేదని మాట్లాడుతుండటం హాస్యాస్పదమని అన్నారు.డోర్నకల్ నియోజకవర్గంలో ప్రతీ గ్రామపంచాయతీ ,మారుమూల తండాకు రోడ్లు వేసిన ఘనత ఎమ్మెల్యే రెడ్యానాయక్ దే అని అన్నారు.నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించిన మా నాయకుని విమర్శించే స్థాయి నీకు లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని అన్నారు.. పక్కన నియోజవర్గంలో ఉన్న మీ యొక్క కుటుంబంలో మీ సోదరుడు బిఆర్ఎస్ పార్టీ తరపున పదవులు పొందుతూ ప్రజలకు సేవ చేస్తుంటే, మీరు సూర్యాపేటలో హాస్పిటల్ పెట్టి అక్కడ అమాయక ప్రజల్ని జనాన్ని మోసం చేసి డబ్బులు సంపాదించి మా నియోజకవర్గంలో ఎప్పుడో ఒకసారి వచ్చి జనాన్ని మభ్యపెట్టి ఓట్ల కోసం వచ్చి, నీకు ఓట్లు వేసిన వారిని పట్టించుకోకుండా తిరిగి వెళ్ళే నీకు, ప్రజలకు సేవ చేసే మా నాయకుని యొక్క గొప్పతనం కనిపించడంలేదా అని అన్నారు. ఇక్కడ ఉండబడిన మా నియోజకవర్గ ప్రజలను, గ్రామ ,గ్రామాన, వీధి వీధినా అడిగితే తెలుస్తుందని అన్నారు.ఇక్కడ నియోజకవర్గంలో ఎన్ని తండాలు ఉన్నాయో అన్ని తండాలను పేర్లు పెట్టి గుర్తుంచుకునే దమ్ము ధైర్యం మా నాయకుడికి ఉందని , నియోజకవర్గంలో ఎన్ని తండాలు ఉన్నాయో, గ్రామపంచాయతీలు ఉన్నాయో, ఎంతమంది ఓటర్లు ఉన్నారో, చెప్పలేని నీవు మా యొక్క నాయకుని విమర్శిస్తే ఊరుకునేది లేదని, భవిష్యత్తులో మా నియోజకవర్గంలో తిరగకుండా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో నర్సింహులపేట మండల ఎస్టి సెల్ ఉపాధ్యక్షుడు భూక్యా వీరు నాయక్ , మండల ఎస్సీ సెల్ నాయకులు పడమటిగూడెం మాజీ సర్పంచ్ హెచ్చు వెంకన్న,చిదిమిల్ల యుగేందర్ ,హెచ్చు యాకయ్య మరియు నాయకులు వెన్ను వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Tags
