కలిసి పని చేద్దాం ఆత్మహత్యలు నివారిద్దాం-
దంతాలపల్లి తహశీల్దార్ & జాయింట్ సబ్ రిజిస్ట్రార్ టి. శ్రీనివాస రావు.
దంతాలపల్లి తహశీల్దార్ & జాయింట్ సబ్ రిజిస్ట్రార్ టి. శ్రీనివాస రావు.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్స్ లెన్స్ ఆధ్వర్యంలో దంతాలపల్లి తహశీల్దార్ కార్యాలయం లో 'ఆత్మహత్యలు వద్దు-జీవితమే ముద్దు',
'కలిసి పని చేద్దాం-ఆత్మహత్యలు నివారిద్ధాం' అనే
పోస్టర్ ని దంతాలపల్లి తహశీల్దార్ & జాయింట్ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస రావు & డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్స్ లెన్స్ వ్యవస్థాపకుడు ప్రముఖ యువ కవి పున్నమి వెన్నెల రచయిత శ్రీశ్రీ కళా వేదిక తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చిర్ర సతీష్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ శ్రీనివాస రావు మాట్లాడుతూ మానవ జన్మ ఉత్తమమైనది అని జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్న ఆత్మవిశ్వాసం తో జయించి జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించాలి అని మానవ జన్మను మంచి పనులతో మంచి ఆలోచనలతో సార్థకం చేసుకోవాలని పుస్తక పఠనం ద్వారా ఎన్నో సమస్యలు దూరం అవుతాయని ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్స్ లెన్స్ వ్యవస్థాపకుడు ప్రముఖ యువ కవి పున్నమి వెన్నెల రచయిత శ్రీశ్రీ కళా వేదిక తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చిర్ర సతీష్ న్యూస్ టుడే తో మాట్లాడుతూ ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్యలలో ఆత్మహత్యల సమస్య ఒకటి అని ప్రతి చిన్న విషయానికి విలువైన నూరేళ్ల జీవితాన్ని బలి చేసుకుంటున్నారు అని ఇది ఘోర తప్పిదం అని ఆత్మహత్యల నివారణ కు తమ సంస్థ పని చేస్తుందని ఇప్పటి వరకూ 100కు పైగా ప్రభుత్వ పాఠశా లల్లో ఉచిత వ్యక్తిత్వ వికాస సదస్సులు నిర్వహించి 10,000 మంది కి పైగా విద్యార్థులను చైతన్య పరిచి జీవితం మీద అవగాహన పెంచి ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చి దిద్ద డానికి కృషి చేసిందని ఆత్మహత్య పరిష్కారం కాదని సమస్యలు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ ఆత్మహత్యల నివారణకు కృషి చేయాలని ఆయన కోరారు.అనంతరం దంతాల పల్లి మండల నూతన తహశీల్దార్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా తహశీల్దార్ టి.శ్రీనివాస రావు గారిని చిర్ర సతీష్ సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది తో పాటు సోమారపు నవీన్ పాల్గొన్నారు.
