మూడు దశాబ్దాలుగా పాలకుర్తి ప్రజలకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేశాను.
తొర్రూరులో నిర్వహించిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశంలో
పాల్గొన్న హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకులకు ఎవ్వరూ భయపడకండి, ధైర్యంగా పోరాడండి, మీకు ఏ కష్టం వచ్చిన అండగా ఉంటాను. మేం చేసిన సేవా కార్యక్రమాలను మరియు పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్ళండి బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను కూడా ప్రజలకి వివరించేల గ్రామ, మండల స్థాయి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ లు పని చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల వంశీ క్రిష్ణ మాట్లాడుతూ..
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అరాచకాలను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్ళి ప్రజలకు వివరించడం ద్వారా అక్కడ కాంగ్రెస్ గెలుపుకు సోషల్ మీడియా కీలకంగా వ్యవహరించింది. తెలంగాణలో అదే విధంగా కృషి చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఖాయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాలకుర్తి అసెంబ్లీ కో ఆర్డినేటర్లు నక్క యాక స్వామి, కొండ శ్రీను, మండల మరియు గ్రామ కో ఆర్డినేటర్లు పాల్గొనడం జరిగింది.
