రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు సరైన విధంగా సీట్లు ఇవ్వకుంటే పార్టీలను రాజకీయ సమాధి చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుండగాని వేణు హెచ్చరించారు మంగళవారం నర్సింహులపేట మండలంలో కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నరసింహుల పేట మండలం యూత్ అధ్యక్షులు చల్లమల్ల పవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సింహ గర్జన సన్నాక సమావేశంలో గుండగాని వేణు మాట్లాడుతూ 60 శాతం ఉన్న బీసీలకు 23 సీట్లు బిఆర్ఎస్ పార్టీ కేటాయించడం , ఐదు శాతం ఉన్న రెడ్లకు 40 సీట్లు కేటాయించడం,అరశాతం ఉన్న వెలమలకు 11 సీట్లు కేటాయించడం దారుణం అన్నారు, కాంగ్రెస్ ,బిజెపి పార్టీలైన జనాభా దమాషా ప్రకారము బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు, హైదరాబాదులో సెప్టెంబర్ 10న తలపెట్టిన బీసీ సింహ గర్జనను విజయవంతం చేయాలని అన్ని కుల సంఘాలకు పిలుపునిచ్చారు మరియు బీసీ సింహ గర్జన గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది,
ఈ కార్యక్రమంలో నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంపీటీసీ జినకల రమేష్ , సమ్మెట సమ్మయ్య, డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యం రాకేష్ ,మరిపెడ మండల కార్యదర్శి కొత్తకొండ భరత్, నర్సింహులపేట మండల యూత్ ఉపాధ్యక్షుడు చల్లమల్ల నరేష్,నాయిని వీరబాబు, గంట శ్రీశైలం,చల్లమల్ల మహేష్,కుమార్,మనోజ్ సంతు,తదితరులు పాల్గొన్నారు
