మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ఎస్టీ హాస్టల్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని గార్ల మండలం లింగ్యా తండా కు చెందిన బోడ సుమన్(30)అను వ్యక్తి మృతిచెందాడు.కాగా మరో ఇద్దరు యువకులు సురేష్ ,సతీష్ అను వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ఘటనను గమనించిన స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.గార్ల మండలం లింగ్యా తండా కు చెందిన సురేషు, బోడ సుమన్ ఖమ్మం షాపింగ్ మాల్ లో దినసరి కూలీలుగా పనిచేస్తుంటారు. రోజు లాగే ఖమ్మం ద్విచక్ర వాహనంపై వెలుతుండగా , డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన వీఆర్ఏ సతీష్, అమ్మపాలెం నుండి డోర్నకల్ కు వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టాడు.దీంతో సుమన్ అనే వ్యక్తి స్పాట్లోనే మృతి చెందాడు.
