డోర్నకల్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే టికెట్ కు నియోజకవర్గ ఆశావాహులు, బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు బానోత్ ప్రభాస్ నాయక్ దరఖాస్తు సమర్పించారు. సోమవారం హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షులతో కలిసి ఆయన దరఖాస్తు సమర్పించారు. పార్టీ చరిత్రలోనే బీజేపీ పార్టీలో తొలిసారి అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరించింది. బీజేపీ అభ్యర్థుల ఎంపికలో సరికొత్త సంప్రదాయంగా చెప్పవచ్చు. డోర్నకల్ నియోజకవర్గంలో కొత్త, పాత క్యాడర్ లేకుండా వివిధ పార్టీల నుండి ప్రభాస్ నాయక్ ఆధ్వర్యంలో చేరికలతో నియోజకవర్గ ఊపందుకుందని పలువురు పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. అనంతరం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. డోర్నకల్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో బూత్ లెవల్ కమిటీల పైన పూర్తి స్థాయిలో దృష్టి సారించామని అలాగే కీలక నేతలు , కార్యకర్తలను పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తులు ప్రారంభించామని చేరికలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయని కచ్చితంగా డోర్నకల్ గడ్డ పైన కాషాయ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొనతం పెంటయ్య, కురవి మండల అధ్యక్షుడు నాగరాజు, చిన్నగూడూరు మండల అధ్యక్షుడు బోయిని యాకన్న, డోర్నకల్ మండల అధ్యక్షుడు నగేష్, నర్సింహులపేట మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, మరిపెడ మండల అధ్యక్షుడు రమేష్, బిజెపి నాయకులు రెహమాన్, రెడ్డి, తదితరులు ఉన్నారు.
