మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామానికి చెందిన మెరుగు కిరణ్ తాను ఎస్సీ కులం నాకు చెందిన దళిత బంధు పథకం వర్తింప చేయడం లేదని అలాగే రెండు పడక గదుల ఇండ్లు, గృహ లక్ష్మి పథకాలు అర్హులకు వర్తింప చేయడం లేదని, అధికారులకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి అందించారు.
కేసముద్రం మండలం తిమ్మంపేట గ్రామ పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ఉన్నతాధికారులు ఆకస్మిక పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోవాలని పెరుమళ్ళ చరణ్ గౌడ్, చందు, తరుణ్ విజ్ఞప్తి చేశారు.
సిరోలు మండలం కొత్తూరు సి గ్రామానికి చెందిన మనిశెట్టి వేణు తన దరఖాస్తు అందిస్తూ తమ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ కు పి.ఈ.టి.నియమించాలని కోరారు.
గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన బోడ తారమ్మ తన దరఖాస్తు అందిస్తూ కూలీ పనులకు వెళ్ళగా తన కుడికాలు విరిగినదని తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని జీవనోపాధికి ఇబ్బందులు పడుతున్నందున దివ్యాంగురాలు పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా 118 దరఖాస్తుల స్వీకరణ అనంతరం అదనపు కలెక్టర్ డేవిడ్ అధికారులను ఆదేశిస్తూ త్వరితగతిన విజ్ఞప్తులను పరిష్కరించాలన్నారు.
ఈ గ్రీవెన్స్ డే లో జడ్పీ సీఈఓ రమాదేవి డిఆర్డిఓ సన్యాసయ్య జిల్లా అధికారులు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
