Type Here to Get Search Results !

మహబూబాబాద్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు.. జిల్లా ఎస్పీ చంద్రమోహన్

ప్రజల శాంతికి భంగం కలుగకుండా మహబూబాబాద్
జిల్లాలో ప్రశాంత వాతావరణం కొనసాగించడానికి పోలీస్ యాక్ట్ నిబంధనలను అమలు చేయడం జరుగుతుందని.. 
ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, ప్రజలు గుమికూడే కార్యక్రమాలను చేపట్టాలంటే ముందస్తుగా డీఎస్పీ అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు.

నెల రోజుల పాటు నిషేధిత ఆయుధాలు, కత్తులు , కర్రలు, జెండా కర్రలు, దుడ్డు కరలు, తుపాకులు, పేలుడు పదార్ధాలు, దురుద్ధేశంతో నేరాలకు ఉసిగొల్పే ఎటువంటి ఆయుధాలు, సామగ్రీ కలిగి ఉండొద్దని పేర్కొన్నారు. జనజీవాననికి ఇబ్బంది చిరాకు కలిగించేందుకు దారితీసే ఇబ్బందికర ప్రజా సమావేశాలు, జనసమూహం లాంటివి పూర్తిగా నిషేదం. ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షకు అర్హులు అవ్తారు .... శాంతి పూర్వకంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తుగా అన్ని వివరాలు వెల్లడించి అనుమతులు కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఎస్పీ తెలిపారు...

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.