- నాలుగు వేల రూపాయల జరిమానా
ఏడాది శిక్ష.
- నాలుగు వేల రూపాయల జరిమానా.
మైనర్ బాలికను వేధించిన కేసులో ఫోక్సో చట్టం ప్రకారం నిందితుడికి ఏడాది జైలు శిక్ష మరియు నాలుగు వేల రూ.ల జరిమానా ను జిల్లా జడ్జి పి.చంద్రశేఖర ప్రసాద్ విధించినట్లుగా కురవి ఎస్సై గోపి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామ శివారు బాలు తండాకు చెందిన భూక్యా ప్రసాద్ పై ఓ ఘటనలో పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేయగా వాదోపవాదాలు విన్న తరువాత జిల్లా జడ్జి పీ.చంద్రశేఖర్ ప్రసాద్ సంవత్సరం జైలు శిక్ష నాలుగు వేల రూపాయల జరిమానా విధించారని తెలిపారు. 2021లో కేసు నమోదు జరిగిందని ,ఆకతాయిలు జాగ్రత్తగా ఉండాలన్నారు.మహిళలు ,యువచులు ,చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఫోక్సో వంటి కఠిన చట్టాలున్నాయని చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరని హెచ్చరించారు. మహిళల పట్ల గౌరవంగా ఉండాలని సూచించారు.
