Type Here to Get Search Results !

పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం రాష్ట్ర రైతాంగ వికాస సోపానానికి ధర్పణo...... మంత్రి ఎర్రబెల్లి దయాకర్




నమస్తే మానుకోట న్యూస్



పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో రాష్ట్ర పామాయిల్ సాగు రైతాంగానికి మహర్దశ సంతరించుకోనున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

తొర్రూరు మండలంలోని పోలేపల్లి గ్రామంలో 2 కోట్ల రూపాయలతో 33/11 కె.వి విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేసి, హరిపిరాలలోని ఆయిల్ ఫామ్ నర్సరీలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు.

మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ డివిజన్లోని గోపాలగిరి, చర్లపాలెం, హరిపిరాల కూడలిలో 45 ఎకరాల భూమిలో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో 200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ కి ఆయిల్ ఫెడ్ సంస్థ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యే కలెక్టర్లతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పైసల ఉత్పత్తి చేసే అధిక దిగుబడి లాభదాయక పంటగా పామాయిల్ సాగు విస్తరిస్తుందని, శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుందని, 85ఎకరాల స్థలంలో నర్సరీని ఫ్యాక్టరీని నిర్మించుకోవడం ప్రాంత రైతులకు శుభప్రదమని, రవాణా చార్జీలతో సహా వ్యవసాయ క్షేత్రం నుండి ఫ్యాక్టరీ వరకు ప్రభుత్వం చెల్లిస్తుందని, ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీ ఉంటుందని, ఇతరులకు 90 శాతం సబ్సిడీతో అందిస్తున్నట్లు,3 సంవత్సరాలలో పంట చేతికి వస్తుందని, జిల్లాలో 7000 ఎకరాలలో పామాయిల్ మొక్కలు నాటినప్పటికీ, 12వేల ఎకరాలకు సరిపడేవి హరిపిరాల నర్సరీలో ఉన్నాయని, 70.25% రికవరీ రైతు వాట వర్తిస్తుందని,51 వేల రూపాయల రాయితీని అందిస్తుందని,30 ఎకరాలలో జిల్లాలో సాగు చేయడాని అనుకూలంగా ఉందని, తేమ శాతం ఉంటే సరిపోతుందని, 1 ఎకరానికి 6 టన్నుల వరకు బంట్స్ వస్తున్నాయని, 1టన్నుకు 14 వేల నుండి 16 రూపాయలు పలుకుతుందని, కరోనా సమయంలో 26 వేలకు పైచిలుకు టన్నుకు వచ్చాయని, రైతులను వ్యవసాయ రంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ కెసిఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, నోటిఫైడ్ ఏరియా గా గుర్తిస్తూ టీఎస్ ఆయిల్ ఫెడ్ సంస్థను ఫ్యాక్టరీ జోన్ గా కేటాయించడం జరిగిందని, ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, నియోజకవర్గాలు పంటను ఈ ఫ్యాక్టరీ కి తరలించే అవకాశం ఉందని 1000కి పైగా ఇందులో ఉద్యోగ అవకాశాలు భూమి కోల్పోయిన వారికి అందజేయాలనే సంకల్పంతో ఉన్నామని, 70 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణానికి టెండర్లు పూర్తి అయినవని ఫ్యాక్టరీ పనులను వెంటనే ప్రారంభించనున్నట్లు, రాష్ట్రంలో 4 మాత్రమే ప్రభుత్వ ఆయిల్ ఫాం ఫ్యాక్టరీలు ఉన్నాయని ఈ ప్రాంతంలో నిర్మించుకోవడం అభివృద్ధికి సూచికని మంత్రి తెలిపారు.

 రైతుబంధుతో ప్రతి సంవత్సరానికి 10,000 రూపాయలు ఎదురు పెట్టుబడి సహాయం అందిస్తూ, 75 వేల కోట్లు ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో వెయ్యనైనదని, 24 గంటల నాణ్యమైన కరెంటును అందిస్తున్నారని 5HP 1 మోటారుకు1లక్ష10 వేల రూపాయలు సంవత్సరానికి ఎలక్ట్రీక్ బోర్డుకు చెల్లిస్తున్నారని,10 కోట్ల రూపాయలు ఇప్పటికీ చెల్లించినైనదని, లక్ష మేరకు పంట రుణమాఫీ చేస్తూ మాట నిలుపుకున్నారని అన్నారు.

జిల్లా సాంస్కృతిక శాఖ కళాకారులు సంక్షేమ పథకాలపై ఆలపించిన గీతాలు ఎంతో అలరించాయని, కళాకారులను అభినందిస్తూ పి ఆర్ సి వర్తింపజేసిన కెసిఆర్ ప్రభుత్వానికి నిబద్ధతతో పనిచేయాలని టి ఎస్ ఎస్ కళాకారులు ఏర్పాటు చేసిన చిత్రపటానికి మంత్రి ఎంపీ ఎమ్మెల్యేలు పాలాభిషేకం చేయనైనది.

 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె.శశాంక మాట్లాడుతూ పామాయిల్ సాగు తో రైతులకు అధిక లాభాలు ఉన్నాయని, ఫ్యాక్టరీని జిల్లాలో నిర్మించుకోవడం హర్షనీయమని, ఈ అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకొని ఫామాయిల్ పంట సాగు పై దృష్టి సారించాలన్నారు. సాగు చేసుకోవాలనుకునే రైతులకు ఉద్యానవన శాఖ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు.కోతుల బెడద లేకుండా, తక్కువ శ్రమతో లాభాలు పొందవచ్చని, సబ్సిడీ వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ సంస్థ చైర్మన్ రామకృష్ణారెడ్డి , ఆయిల్ ఫెడ్ సురేందర్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, డిహెచ్ఎస్ఓ సూర్యనారాయణ డీఏవో చత్రునాయక్, ఎంపీపీలు చిన్న అంజయ్య, ఈదురి రాజేశ్వరి, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, పిఏ సిఎస్ చైర్మన్ కాకిరాల హరి ప్రసాద్, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, రామ సహాయం కిషోర్ రెడ్డి, డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.