నర్సింహులపేట మండల కేంద్రంలో సిపిఎంఎల్ ప్రజా పంథ కార్యకర్తల సమావేశంలో పార్టీ డివిజన్ కార్యదర్శి ముంజం పల్లి వీరన్న మాట్లాడుతూ రాష్ట్రంలో చాలామంది నిరుపేదలు గూడు లేకుండా ఉన్నారని, నిలవ నీడ లేని పేదలు పిల్ల పాపలతో అరకొర నివాస సౌకర్యంతో కూలి నాలి చేస్తూ బతుకు ఈడుస్తున్నారని, వీరికి సరైన నివాస సౌకర్యం లేదు కావున అర్హులైన ప్రజలందరికీ తక్షణమే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కానీ ఇంటికి సరిపడా ఆర్థిక సహాయం ఇవ్వాలని వీరన్న అన్నారు.
ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బండపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధికార పార్టీ వారికే కాకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా అర్హులైన పేదలందరికీ ఇల్లు కట్టించి ఇవ్వడమో లేదా ప్రతి ఇంటికి 15 లక్షల ఆర్థిక సహాయం లబ్ధిదారుల ఖాతాలో వేయడము చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్, రాములు నాయక్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.