తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ నిర్మాత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, మూడోసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మంత్రుల నివాససముదాయంలో
ఆదివారం వేదపండితులతో, నియమ నిష్టలతో ఘనంగా మృత్యుంజయ హోమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఓ ప్రకటనలో మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర సత్వర అభివృద్ధికి అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకురావడంతో దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని మంత్రి తెలిపారు. కేవలం తొమ్మిదిన్నర ఏండ్లలోనే తెలంగాణలో అభివృద్ధి గణనీయంగా జరిగిందని, ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే స్థాయికి మన రాష్ట్రం ఎదిగిందన్నారు.రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలనీ,వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శక్తి పొందాలని కోరుకుంటూ శాస్త్రోక్తంగా మృత్యుంజయ హోమం నిర్వహించారు.ఉదయం 4:30 ని.లకు ప్రారంభమైన మృత్యుంజయ హోమం పూర్ణాహుతికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్సీ లు కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, సురభి వాణిదేవి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, మహబూబాబాద్ జిల్లా జెడ్పి చైర్ పర్సన్ కుమారి అంగోత్ బిందు, బీఆర్ ఎస్ నాయకులు గుగులోత్ శ్రీరామ్ నాయక్, తదితరులు హాజరై, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
