గడువులోగా ప్రగతి సాధిస్తామని జిల్లా కలెక్టర్ శశాంక నివేదించారు.
సోమవారం ఐ.డి.ఓ.సి. లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో హరితహారం, ఆసరా పెన్షన్లు, రెండవ విడత గొర్రెల పంపిణీ, మైనార్టీ సంక్షేమ పధకం, గృహాలక్ష్మి, రెండవ విడత దళిత బంధు, సాంఘిక సంక్షేమ ఇండ్ల స్థలాల పంపిణీ, జి.ఓ.59 క్రమబద్దీకరణ, జి.ఓ.84 నోటరీ స్టాంప్ పేపర్ల క్రమబద్దీకరణ వంటి పలు కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ లతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అటవీశాఖ అధికారి రవికిరణ్ తో కలిసి కలెక్టర్ తెలియ జేస్తూ...జిల్లాలో ఈనెల 26వ తేదీన స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా కోటిమొక్కలను నాటే కార్యక్రమం చేపట్టి అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని గూడూరు మండలం అప్పరాజుపల్లి అటవీ క్షేత్రంలోని జన్నాయకుల గూడెంలో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం తో విస్తృతంగా మొక్కలు నాటడం జరిగిందన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వులు 59 క్రింద క్రమబద్దీకరణ కు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఆసరా పెన్షన్లు, రెండవ విడత గొర్రెల పంపిణీ, లబ్ధిదారుల ప్రక్రియ పూర్తి అయిన చోట పంపిణీ జరుగుతున్నదన్నారు.
గృహాలక్ష్మి దరఖాస్తుల పరిశీలన జరుగుతున్నదని, రెండవ విడత దళితబంధు కొరకు నియోజక వర్గం వారీగా 1100 మంది లబ్ధిదారులను ప్రజాప్రతినిధుల సహకారంతో ఎంపిక చేస్తున్నామన్నారు.
కారుణ్య నియామకాలను పూర్తి చేశామని, జూనియర్ పంచాయతీ సెక్రటరీ లు 248 మంది లలో 29 మంది మాత్రమే వివిధ కారణాలతో మిగిలిపోయారని, వారిలో కూడా 14మందికి వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. వివిధ కేసులలో ఉన్న వారిని పరిశీలించవలసి ఉందన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జడ్పి సి.ఈ.ఓ. రమాదేవి, డి.ఆర్.డి.ఓ. సన్యాసయ్య, మహబూబాబాద్, తొర్రుర్ ఆర్డీఓ లు అలివేలు, నరసింహారావు, బి.సి.సంక్షేమ అధికారి నర్సింహ స్వామి, ఎస్సి కార్పొరేషన్ ఈడి బాలరాజు, షెడ్యూల్ సంక్షేమాధికారి సన్యాసయ్య, మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఎక్సైజ్ అధికారి కిరణ్ కుమార్, హౌసింగ్ అధికారి సదానందం, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి తదితరులు పాల్గొన్నారు.
