డోర్నకల్ మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన దీక్ష పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు సూర్యప్రకాష్ హాజరయ్యారు .ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ డోర్నకల్ ప్రజలు మరియు విద్యార్థుల చిరకాల వాంఛ అయినటువంటి జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం ఈనెల 29 మంగళవారం నాడు జరిగే నిరవధిక దీక్షను జయప్రదం చేయాలని అన్నారు.జూనియర్ కళాశాల లేక విద్యార్థులు అని అవస్థలు పడుతున్నారని,చదువుకోవడానికి దూరం ప్రాంతాలు వెళ్లాల్సి వస్తుందని అవేదన వ్యక్తం చేశారు..
చాలామంది విద్యార్థులు మధ్యలోనే డ్రాప్ అవుట్ అయ్యి చదువును ఆపేశారని ఆవేదన చెందారు.
అదేవిధంగా డోర్నకల్ మండల కేంద్రంలో సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని, మైనార్టీ గురుకులానికి నూతన భవనం ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లతో నిరవధిక దీక్షను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు..
అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయని తప్ప,ప్రజా ప్రతినిధులు విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు...
కావున డోర్నకల్ మండలం లో ఉన్న ప్రజాతంత్ర వాదులు, మేధావులు, వివిధ పార్టీల, ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు హాజరై మద్దతు తెలపాలని కోరారు .
ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సింహాద్రి మండల నాయకులు దివ్య, స్వప్న, వినయ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
