Type Here to Get Search Results !

బిఎల్ఓ సూపర్వైజర్లు ఎన్నికల విధానంపై అవగాహన పొందాలి... జిల్లా కలెక్టర్ శశాంక

నమస్తే మానుకోట న్యూస్


బి ఎల్ వో లుగా వివిధ శాఖల నుండి నియమింపబడిన వారు పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాహన పొందాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

బుధవారం ఐడిఓసి లోని కలెక్టర్ సమావేశం మందిరంలో బిఎల్ఓ ల పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బి ఎల్ ఓ లకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని సందర్శించినట్లుగా ఫోటోలు పంపించాలన్నారు.

పోలింగ్ కేంద్రాల వారీగా తొలగింపులు చేర్పులపై పూర్తి అవగాహన పొందాలన్నారు. 18 సంవత్సరాల యువ ఓటర్లను గుర్తించాలన్నారు పోలింగ్ కేంద్రం పరిధిలో 250 కుటుంబాలు ఉంటాయని ఒక్కొక్క ఇంటిలో సుమారు నాలుగు నుండి ఆరు ఓట్లు ఉండే అవకాశం ఉందన్నారు.

దివ్యాంగుల ఓటర్ల ను గుర్తించి మార్కింగ్ చేసుకోవాలన్నారు పోలింగ్ కేంద్రాలకు రాలేని వారిని గుర్తించాలన్నారు అదేవిధంగా 80 సంవత్సరములు పైబడిన వారిని కూడా గుర్తించాలన్నారు మృతి చెందిన వారికి మరణ ధ్రువీకరణ పత్రం ప్రాతిపదిక కాదని తెలియజేశారు.

ఎంపీడీవోలు ఎలక్ట్రోలతో ఎటువంటి సంబంధం లేదని ప్రతి పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు పరిశీలిస్తూ లేని వాటిని గుర్తించి భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఓటు హక్కు పై చేపట్టే ప్రచారంలో భాగస్వాములు కావాలని విస్తృత ప్రచారం కొరకు పాటుపడాలన్నారు స్వీప్ కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు ఓటు హక్కు వినియోగించుకునేలా ఆవశ్యకతను తెలియజేప్పాలన్నారు.

స్వీ ప్ అధికారులు జిల్లాలో కళాశాలలో ఎంపిక చేసుకొని కార్యక్రమాలను రూపొందించుకొని అమలు పరచాలని 18 సంవత్సరాల వారిని గుర్తించి ఓటు హక్కు పొందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో స్వీప్ నోడల్ అధికారి సన్యాసయ్య మహబూబాబాద్ తొర్రూరు ఆర్డీవోలు అలివేలు నరసింహారావు డిపిఓ నర్మద ఎంపీడీవోలు తాసిల్దార్లు బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.