నమస్తే మానుకోట న్యూస్
డోర్నకల్ లో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని నియోజకవర్గ ఆశవాహ అభ్యర్థి, రాష్ట్ర గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు బానోత్ ప్రభాస్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం భారతీయ జనతా పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యాలయంలో నర్సింహులపేట మండలం కొమ్ములవంచ, జయపురం శివారు బక్క తండాకు చెందిన సుమారు 15 మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు భాజపా జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచంద్రరావు పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డోర్నకల్ నియోజకవర్గంలో భాజపా పార్టీ బలోపేతానికి బానోత్ ప్రభాస్ నాయక్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. పార్టీలో చేరుతున్న కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. డోర్నకల్ లో ప్రభాస్ నాయక్ రాకతో నియోజకవర్గంలో పార్టీ పటిష్టంగా బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. అనంతరం డోర్నకల్ నియోజకవర్గ ఆశవాహ అభ్యర్థి, రాష్ట్ర గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు బానోత్ ప్రభాస్ నాయక్ మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోడి పాలనకు ఆకర్శితులై పలువురు యువత బిజెపిలో చేరుతున్నారని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ఎంతో ప్రగతి సాధించింది అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం సురేష్, భాజపా నాయకులు ఉపేందర్ తదితరులు ఉన్నారు.
