చేతిలో చిల్లిగవ్వ లేకుండా.. ప్రాణాపాయంతో ఐసియు లో ఉన్న జర్నలిస్ట్ ను ఆదుకోండి..
(నమస్తే మానుకోట-డెస్క్)
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న తట్టుపల్లి గ్రామానికి చెందిన కొప్పుల శ్రీనివాస్ ఉదయం విధినిర్వాహణలో బాగంగా కురవిలో ఉన్న సమయంలో గుండెపోటు కు గురయ్యారు.గమనించిన తోటి జర్నలిస్టులు హుటాహుటిన మహబూబాబాద్ లో చూపిస్తే ఇక్కడ లాభంలేదు.. పరిస్థితి విషమంగా ఉంది పెద్ద ఆసుపత్రికి తీసుకెల్లమని వైద్యులు సూచించారు. తోటి విలేకరులే తలాకొంత వేసుకొని అంబులెన్స్ లో ఖమ్మం తీసుకవెల్లారు.ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొప్పుల శ్రీనివాస్ బ్రతకాలంటే వైద్యానికి సుమారు రూ.2.50లక్షలకు పైగా డబ్బులు కావాలి.వృత్తిపరమైన వత్తిడే తప్పా నిఖర ఆదాయంలేని జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్న నిరుపేద దళిత జర్నలిస్ట్ కు ఊపిరిపోద్దాం..ఎంతయితే అంత.. ఎంతో కొంత మీ..వంతుగా ఆర్ధికసహాయం చేయండి.. ఓ..నిండుప్రాణాన్ని నిలపడానికి మీ..వంతు సహాయం చేయండి.సంప్రదించవలసిన పోన్ పే నంబర్: 9059136474(శ్రీనివాస్).
