ఓటర్ జాబితా పరిశీలనను పూర్తి అవగాహన తో చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. శుక్రవారం ఐ.డి.ఓ.సి.లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఓటర్ల జాబితా పరిశీలన...అవగాహన కార్యక్రమాన్ని బి.ఎల్.ఓ.లతో ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వంద సంవత్సరాలు నిండిన వారు 80 మంది ఉన్నారని నివేదిక చెబుతున్నదని మరికొన్ని పోలింగ్ కేంద్రాలలో 18 సంవత్సరముల వాళ్లు ఓటర్ నమోదు శాతం తక్కువగా ఉండటం జరిగిందని అదేవిధంగా పోలింగ్ కేంద్రానికి రెండు శాతం దివ్యాంగులు ఉండాలని అందుకో పెన్షన్ డేటా పరిశీలించాలని మృతుల వివరాలు తగిన ఆధారాలు లేక తొలగించకపోవడం వంటివి సరి చేసేందుకు సమగ్ర దర్యాప్తు చేపట్టాలన్నారు.కొత్తగా వివాహాలు చేసుకుని వచ్చిన వారికి వెంటనే ఫామ్ సిక్స్ ఇవ్వరాదని గతంలో ఓటు హక్కు ఉన్నదా లేదా ఉంటే ఎక్కడ ఉన్నది అన్నది పరిశీలించుకోవాలన్నారు ఎక్కడ ఓటు లేని పక్షంలోనే ఫారం 6 ద్వారా ఓటు హక్కు కల్పించాలన్నారు.ఈనెల 26 27 తేదీల లోను , సెప్టెంబర్ మాసంలో రెండు మూడు తేదీలలోనూ ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలు ఏర్పాటు చేసినందున బి ఎల్ ఓ లు ఉదయం 10 గంటలకల్లా పోలింగ్ కేంద్రాలలో ఉండాలని కలెక్టర్ తెలియజేశారు.ఈ వర్క్ షాప్ లో అదనపు కలెక్టర్ డేవిడ్ డి ఆర్ డి ఓ సన్యాసయ్య ఆర్డీవోలు అలివేలు నరసింహారావు తాసిల్దార్లు జిల్లా అధికారులు బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు
