ఈ సందర్భంగా సర్పంచ్ శంకర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల వారికి సమన్యాయంగా చేస్తున్నారని తెలిపారు.రైతుబంధు, రైతు బీమా,కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్,బీసీ బందు,రైతు రుణమాఫీ,గృహలక్ష్మి పథకంతో నిరుపేదలకు ఇండ్లను ఇస్తున్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్,పంచాయతీ వార్డు సభ్యులు,గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
