ఉపాధ్యాయులు మౌనం వీడి క్రియాశీల పోరాటాలకు సిద్ధమవ్వాలని టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింతల విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ గూడూరు మండల శాఖ ఆధ్వర్యంలో గూడూరు మండలంలోని, ప్రాథమిక పాఠశాలు సురేష్ నగర్, ఎర్రగుంట తండా ,జగన్ నాయకులగూడెం, యుపిఎస్ కొల్లాపూర్ ,బొద్దుగొండ, అప్ప రాజు పల్లి, జెడ్ పి ఎస్ హెచ్ మచ్చర్ల తదితర పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ గూడూర్ మండల అధ్యక్షులు సోమ రవి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మహబూబ్ అలీ ఇక ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింత విష్ణువర్ధన్ రెడ్డి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మచ్చర్ల లో మాట్లాడుతూ ఉపాధ్యాయులు మౌనం వీడి క్రియాశీల పోరాటాలకు సిద్ధమవ్వాలని అన్నారు. టి పి టి ఎఫ్ ఎప్పుడూ పోరాటాల ద్వారానే సమస్యలు సాధించబడతాయని నమ్మి పోరాటాల బాటలో ముందుంటుందని అన్నారు. ఉపాధ్యాయులు టీ పి టి ఎఫ్ సంఘానికి సభ్యత్వాన్ని ఇచ్చి సంఘ బలోపేతానికి తోడ్పడాలని కోరారు. విద్యా రంగ సమస్యల పట్ల ప్రభుత్వం సాచివేత ధోరణి అవలంబిస్తుందని మన ఊరు మనబడి పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలలో సరియైన నిధులు విడుదల చేయకపోవడం వల్ల పాఠశాలల్లోని వివిధ పనులు నత్తనడకగా నడుస్తున్నాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికిని ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం లేదని తద్వారా అనేక పాఠశాలలో విషయ నిపుణుల కొరత ఉన్నదని అన్నారు. అంతే కాకుండా ప్రధానోపాధ్యాయుల పోస్టులు, మండల విద్యాశాఖ అధికారుల పోస్టులు జిల్లా విద్యాశాఖ అధికారుల పోస్టులు అన్నీ కూడా ఖాళీగా ఉండటం వల్ల ఇన్చార్జిలతో నిర్వహించడం వల్ల విద్యాశాఖ పర్యవేక్షణ అస్తవ్యస్తంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సోమ విష్ణువర్ధన్ జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, మమత, సోహెంద్బి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు మౌనం వీడాలి..పోరాటాలకు సిద్దమవ్వాలి-విష్ణువర్థన్ రెడ్డి.
August 24, 2023
0
Tags
