(నమస్తే మానుకోట-మహబూబాబాద్)
ఇంటింటి సర్వేలో ఓటర్ల నమోదు పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.గురువారం ఐ.డి.ఓ.సి.లోని కాన్ఫరెన్స్ హాల్ లో
ఓటర్ల జాబితా పై పోలింగ్ స్టేషన్ల వారీగా అదనపు కలెక్టర్ డేవిడ్ తో కలిసి బి ఎల్ వో ల తో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...
ఇంటింటి సర్వేలో ఓటర్ల నమోదు పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.ఇంటినెంబర్ లేని ఇండ్లల్లో ఉన్న ఓటర్లు నమోదు కొరకు పక్క ఇంటి నెంబర్తో నమోదు చేయాలన్నారు.మృతుల ఓటర్ల తొలగింపులో మరణ ధ్రువీకరణ పత్రము ప్రాతిపదిక కాదని తెలియజేశారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 ఓట్ల నుండి 1000ఓట్ల వరకు నమోదయి ఉంటారని వారిలో కనీసం 30 మంది అయిన 18 సంవత్సరముల వాళ్లు ఓటరుగా నమోదై కనిపించాలన్నారు.జిల్లాలో గూడూరు మండలం ఊట్ల గ్రామం కేసముద్రం మండలం ఇనుగుర్తి ,అప్పరాజుపల్లి , చిన్న ముప్పారం లోని పెద్ద తండా నెల్లికుదురు మండలంలోని నైనాల మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి జంగిలిగొండ మాదాపురం ఇస్లావత్ తండా ఉన్నాయని 18 సంవత్సరంలో ఓటర్లు నమోదును పక్కాగా చేపట్టాలన్నారు.ప్రతి పోలింగ్ స్టేషన్లో పరిధిలోని 250 కుటుంబాలకు సుమారు 800 ఓట్ల పైగా ఉంటాయని ప్రతి ఓటు వివరాలు బిఎల్ఓ దగ్గర తప్పనిసరిగా ఉండాలన్నారు.దివ్యాంగుల ఓటర్లను గుర్తించాలని పోస్టల్ బ్యాలెట్కు వారు దరఖాస్తు చేసినప్పుడు సదరు దరఖాస్తు పేరు ఓటర్ల లిస్టులో తప్పనిసరిగా ఉండి తీరాలన్నారు ఈనెల 21 నుండి సెప్టెంబర్ 19వ తేదీ వరకు నెలరోజుల కాలపరిమితి ఉన్నందున ఇంటింటి ఓటర్ నమోదు సర్వే పక్కాగా చేపట్టలన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్ జిల్లా అధికారులు హైమావతి నర్మద తాసిల్దార్లు ఎంపీడీవోలు బిఎల్ఓ లు తదితరులు పాల్గొన్నారు.
