వాల్యా తండా సర్పంచ్ గుగులోత్ చంద్రావతి మురళీ నాయక్
(నమస్తే న్యూస్, దంతాలపల్లి, డిసెంబర్ 14):
స్థానిక సంస్థల ఎన్నికల్లో నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించిన వాల్యా తండా ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ఈ విజయం తండా అభివృద్ధి పట్ల తమ బాధ్యతను మరింత పెంచిందని గెలుపొందిన సర్పంచ్ గుగులోత్ చంద్రావతి మురళీ నాయక్ తెలిపారు.దంతాలపల్లి మండలంలోని బీరిశెట్టిగూడెం వాల్యా తండా గ్రామపంచాయతీలో నిర్వహించిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఎస్సీ చదివిన గుగులోత్ చంద్రావతి మురళీ నాయక్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఆదివారం వారు మాట్లాడుతూ, గ్రామ ప్రజల సహకారంతో తండాలో ఉన్న సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. తమపై నమ్మకంతో ఓటు వేసిన గ్రామస్తుల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా, ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టం చేశారు.నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించిన వాల్యా తండా ప్రజలకు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని సర్పంచ్ పేర్కొన్నారు.

