అధ్వాన్నంగా మారిన చింతపల్లి గూడా పార్క్.
(నమస్తే న్యూస్, రంగారెడ్డి,జనవరి 02)
అధికారుల నిర్లక్ష్యంతో చింతపల్లిగూడ పార్క్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని దళిత చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఉక్కుల అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. శంషాబాద్ జోనల్, ఆదిబట్ల సర్కిల్, కొంగరకలాన్ డివిజన్ పరిధిలోని చింతపల్లిగూడ పార్క్‌ను ఆయన ఈ రోజు సందర్శించారు. అనంతరం మాట్లాడిన ఉక్కుల అశోక్, గ్రామానికి సమీపంలో ఉన్న ఈ పార్క్ ప్రజలకు సక్రమంగా అందుబాటులో లేకపోవడంతో పాటు, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా మరమ్మతులు, నిర్వహణ పనులు చేయకపోవడంతో పార్క్ దయనీయ స్థితికి చేరిందని తెలిపారు. వెంటనే సంబంధిత శాఖలు స్పందించి పార్క్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పార్క్ పరిస్థితిపై స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు జోగు శేఖర్, నాయకులు శేరి రమేష్, ఉడుతల రవి గౌడ్, జోగు మహేందర్‌తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.


