జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి.
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లను ఇవ్వాలి.
–దళిత చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఉక్కుల అశోక్
(నమస్తే న్యూస్, డిసెంబర్ 27, రంగారెడ్డి)
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న న్యాయసమ్మతమైన సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని దళిత చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఉక్కుల అశోక్ డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు నిర్భందంగా ఇవ్వాలని ఆయన సూచించారు.జర్నలిస్టుల అక్రిడిటేషన్‌కు సంబంధించి ఇటీవల జారీ చేసిన జీవో 252ను సవరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త జీవోల ద్వారా జర్నలిస్టుల మధ్య చిచ్చు పెట్టే విధానాలకు పాల్పడకూడదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ప్రభుత్వం మరియు ప్రజల మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులను ఆదుకుని ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత అని ఉక్కుల అశోక్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న పాత్రికేయుల హక్కులను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

