పెద్దముప్పారం గ్రామ ప్రజలకు సర్పంచ్ భరత్ బాబు కృతజ్ఞతలు.
పెద్దముప్పారం సర్పంచ్ కందిమల్ల భరత్ బాబు.
(నమస్తే న్యూస్, దంతాలపల్లి, డిసెంబర్ 14):
స్థానిక సంస్థల ఎన్నికల్లో తనను ఆశీర్వదించిన పెద్దముప్పారం గ్రామ ప్రజలకు, అండగా నిలిచిన నాయకులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కందిమల్ల భరత్ బాబు తెలిపారు. గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని తప్పక నిలబెట్టుకుంటానని, గ్రామ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు.
దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం గ్రామపంచాయతీలో జరిగిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భరత్ బాబు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ గెలుపు తన వ్యక్తిగత విజయమేగాక గ్రామ ప్రజల విజయమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధిపై తన బాధ్యత మరింత పెరిగిందని, పెద్దముప్పారాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతామని చెప్పారు.
గ్రామ ప్రజల సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రజల ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా పాలన అందిస్తామని భరత్ బాబు స్పష్టం చేశారు. ముప్పై ఏళ్ల తరువాత వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించిన గ్రామ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన తెలిపారు.

