యూరియా కోసం రైతుల ఇక్కట్లు.
అధికారుల కాళ్లపై పడి వేడుకున్న రైతన్న.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు.
యూరియా బస్తాలకు వెళితే పురుగుమందులు అంటకడుతున్న ప్రైవేట్ వ్యాపారులు.
తీవ్ర ఆవేదనలో రైతన్నలు.
(నమస్తే న్యూస్, డిసెంబర్ 28, నర్సింహులపేట)
మహబూబాబాద్ జిల్లా లోని, పలు మండలాల్లో
యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బస్తా యూరియా కోసం వ్యవసాయ అధికారి కాళ్లపై పడుతూ రైతన్నలు వేడుకున్న హృదయ విదారక సంఘటన నర్సింహులపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది.ఈ నేపథ్యంలో ఎరువు ఇవ్వాలని అధికారుల కాళ్ళపై పడి రైతు వేడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది ఇలా ఉండగా
సీరోల్ మండలం కాంపల్లి వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
తెల్లవారుజాము నుంచే కార్యాలయం ఎదుట బారులు తీరగా రైతులు క్యూలైన్లలో నిల్చోవాల్సి వచ్చింది.
రైతులు అధిక సంఖ్యలో రావడంతో స్వల్పంగా తోపులాట చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు.యూరియా కొరతతో సాగు పనులు దెబ్బతింటున్నాయని,
వెంటనే సరిపడ ఎరువులు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వ్యవసాయ అధికారులు మాత్రం యూరియా పొందడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఈ యాప్ ను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.యాప్ పై పూర్తి అవగాహన లేకపోవడం, సాంకేతిక కారణాలు, మొబైల్ వినియోగంపై అవగాహన లేకపోవడం తీవ్ర ఇబ్బందులుగా మారాయి. ఇదే అదునుగా ప్రైవేట్ వ్యాపారులు ఏరియా బస్తాలు అడిగిన రైతులకు ఇతర పురుగుమందులు చేస్తేనే ఏరియా బస్తాలు ఇస్తామని అప్పనంగా దోచుకుంటున్నారు. ఈ తథంగమంతా వ్యవసాయ అధికారుల కనుసైగలతోనే కొనసాగుతుందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.


