ఇంటింటా ప్రచారంలో..!సర్పంచ్ అభ్యర్థి సాయిదుర్గ
గెలుపు నీదే అంటున్న గ్రామస్తులు.
ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తున్న ఉంగరం.
(నమస్తే న్యూస్, దంతాలపల్లి,డిసెంబర్ 11) దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ రెబల్ సర్పంచ్ అభ్యర్థి కారుపోతుల సాయిదుర్గ - అనిల్ గురువారం ఇంటింటా ప్రచారంలో తన ఉంగరం గుర్తును చూపిస్తూ అత్యదిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థి స్తున్నారు. ప్రచార కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతు ప్రతి ఇంటి నుండి ప్రజలు ముందుకు వచ్చి అభ్యర్థి సాయిదుర్గ - అనిల్ ని ఆశీర్వదిస్తున్నారు. తమ మద్దతు మీకే అని ప్రకటించడం ప్రచారానికి ప్రత్యేక ఉత్సాహాన్ని తీసుకువస్తుంది.
గ్రామంలో గతంలో తన భర్త అనిల్ చేసిన సేవా కార్యక్రమాలను గుర్తు చేస్తూన కారుపోతుల సాయి దుర్గా - అనిల్ కు గెలుపు మీదే , అంటున్న గ్రామస్తులు,వృద్ధులు,మహిళలు,వివిధ సంఘాలు, యువకుల నుండి విశేష స్పందన వస్తుంది.సాయిదుర్గ ఉన్నత విద్యావంతురాలు కావడంతో తనతో పేద ప్రజలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని,మా ఓటు మీకే అంటూ ఎలాంటి ప్రలోభాలకు లోనూ కాకుండా స్వచ్ఛందంగా గ్రామస్తులు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి కారుపోతుల సాయిదుర్గ - అనిల్ మాట్లాడుతూ గ్రామస్థులకు వైద్య పరంగా,విద్యార్థులకు విద్య పరంగా తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు.మన గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని ప్రతి ఇంటికి సురక్షిత నీటిని అందించడం నా తొలి కర్తవ్యం, శుభ్రతే అభివృద్ధికి తొలి అడుగు, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడమే నా ప్రధాన ప్రణాళిక, గ్రామంలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ,వీధిలైట్లు మెరుగుపరచడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను. మన యువతకు నైపుణ్యాలు మన గ్రామానికి పురోగతి, పదో తరగతి విద్యార్థులకు బాసర, ఐఐటీకి సంబంధించిన మెటీరియల్ అందిస్తాము. మహిళల సాధికారత కోసం మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ఆర్థికంగా ఎదిగేందుకు మహిళా సంఘాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాము. విద్య,ఆరోగ్యం కోసం బాలల విద్య గ్రామ భవిష్యత్తు కావున పాఠశాలలో సదుపాయాలు పెంచేందుకు కృషి చేస్తాము. ప్రతి నెల వృద్ధుల కోసం కంటి మరియు ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించుటకు కృషి చేస్తాము.చిన్నపిల్లలకు అందించే టీకాల విషయంలో శ్రద్ధ వహిస్తాము.పారదర్శకత,నమ్మకం రాబట్టే పనులు చేస్తాము. గ్రామ ప్రజలకు ప్రతి పన్ను ప్రతి ఖర్చు పూర్తిగా పారదర్శకంగా వివరిస్తాము. సేవే మా శక్తి - అభివృద్ధి మా గమ్యం. మీ ఓటు - మన గ్రామ భవిష్యత్తు. గ్రామం ముందడుగు వేస్తే - మనమందరం అభివృద్ధి చెందుతాం. మాటకు నిలబడే నాయకత్వం కావాలంటే నాకు అవకాశం ఇవ్వండి.ప్రజల మద్దతు ఓటు మద్దతుతో విజయం సాధించి గ్రామ సేవను మరింత బలోపేతం చేస్తానని,ఉంగరం అంటే వేళ్లకు అలంకారం కాదు,ప్రజల చేతులకు ప్రగతి సంకేతం.ఉంగరం అంటే వేరుచేసే గుర్తు కాదు,వేల మనసులను ఒక్కటిగా కట్టే బంధం,ఉంగరం అంటే నిన్నటి నిర్లక్ష్యానికి ముగింపు రేపటి అభివృద్ధికి తొలి అడుగు.తన ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.



