(నమస్తే న్యూస్,దంతాలపల్లి,జనవరి 08 ) కార్మికుల సంక్షేమానికి వారి హక్కుల సాధనకై తెలంగాణ కార్మిక సామాఖ్య రాజీలేని పోరాటాలు కొనసాగిస్తుందని వ్యవస్థాపక అధ్యక్షులు కలకోట రామన్న, రాష్ట్ర కార్యదర్శి జిల్లా పర్షరాములు అన్నారు.గురువారం దంతాలపల్లి మండలంలోని రామానుజపురం గ్రామానికి చెందిన మహంకాళి వెంకట్రాములుని జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినట్లు గా తెలిపారు .జిల్లా అధ్యక్షులు ధైద సాగర్,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్మారపు వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకట్రాములు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన వ్యవస్థాపన అధ్యక్షులు రామన్న,రాష్ట్ర కార్యదర్శి పరుషరాములు జిల్లా అధ్యక్షులు సాగర్,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్నకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి,హక్కుల సాధన కోసం కృషి చేస్తానన్నారు.

