నిండు మనస్సుతో ఆశీర్వదించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు
కుమ్మరికుంట్ల సర్పంచ్ కారుపోతుల సాయిదుర్గ అనిల్.
(నమస్తే న్యూస్,దంతాలపల్లి ,డిసెంబర్ 14): స్థానిక సంస్థల ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వదించిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ఈ గెలుపు గ్రామ అభివృద్ధి పట్ల బాధ్యతను పెంచిందని గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతామని గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థి కారుపోతుల సాయిదుర్గ అనిల్ అన్నారు. దంతాలపల్లి మండలంలోని కుమ్మరి కుంట్ల గ్రామంలో జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచుగా కారు పోతుల సాయి దుర్గ అనిల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం వారు మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. తమమీద నమ్మకంతో గెలిపించిన గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆలోచనలకు అనుగుణంగా పనులు చేస్తామని అన్నారు. తమను నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ వారికి రుణపడి ఉంటామని అన్నారు.

