పకడ్బందీ చర్యలతో యూరియా పంపిణీ.
రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపడుతున్న అధికారులు.
జిల్లాలో తగినంత యూరియా ఉంది.
(నమస్తే న్యూస్, మహబూబాబాద్, జనవరి 1)
జిల్లాలో తగిన యూరియా అందుబాటులో ఉందని, ఇంకా అవసరమైన యూరియాను ముందస్తు చర్యలతో రైతులకు నిరంతర సరఫరా చేసే దిశగా అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రకారం ముందుకు సాగుతున్నారని మరిపెడ ఏడీఏ విజయ్‌కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదేశాల మేరకు ముందస్తు సమాచారంతో ఇప్పటికే సూచించిన కేంద్రాల్లో రైతులకు యూరియా పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. కేసముద్రం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మరియు ఆగ్రోస్ ద్వారా క్యాంపు తండా, దానసరి గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి వెంకన్న, తహసిల్దార్ వివేక్ తదితర అధికారులు యూరియా పంపిణీ నిర్వహించారు. పెద్దవంగర, గార్ల పీఎసీఎస్‌ల ద్వారా, అలాగే మరిపెడ మండల కేంద్రంలో కూడా యూరియా పంపిణీ జరుగగా, మరిపెడ ఏడీఏ విజయ్‌చందర్ మరియు సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. యూరియా పొందేందుకు వచ్చే రైతుల కోసం తగిన ఏర్పాట్లు ముందుగానే చేసి, కలెక్టరేట్ నుండి అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తూ, స్థానిక వాట్సాప్ గ్రూపులు మరియు కార్డు వ్యవస్థల ద్వారా ముందస్తు సమాచారం ఇచ్చి పకడ్బందీగా పంపిణీ జరుపుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం యూరియా నిల్వలపై ఎటువంటి సమస్య లేదని, అదనపు అవసరానికి తగిన విధంగా సరఫరా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.






