సీఎం కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్ర నాయక్.
రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యం గా ముందుకు సాగుతున్న ప్రభుత్వం.
రాష్ట్ర ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డా.రామచంద్రనాయక్.
(నమస్తే న్యూస్,జనవరి 01, హైదారాబాద్ )
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుండటం అభినందనీయమని రామచంద్రనాయక్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి చూపుతున్న చిత్తశుద్ధి, పాలనలో తీసుకుంటున్న సంస్కరణాత్మక నిర్ణయాలు రాష్ట్ర ప్రగతికి దోహదం చేస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డాక్టర్ రామచంద్రనాయక్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని హామీ ఇచ్చారు.

