ఘనంగా అయ్యప్ప స్వామి పంబారట్టు
(నమస్తే న్యూస్, దంతాలపల్లి,డిసెంబర్ 10) దంతాలపల్లి మండల కేంద్రంలో బుదవారం అయ్యప్ప గురు స్వాములు అనంతుల వెంకన్న, చీకటి రమేష్,పుప్పాల యాకేష్ ల ఆధ్వర్యంలో కేరళ రాష్ట్రంలోని శబరిమలైలో జరిగిన విధంగా వేద పండితులతో అయ్యప్పస్వామి పంబారట్టు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వాములు,భక్తులతో పంబారట్టు కార్యక్రమాన్ని చేపట్టారు. అయ్యప్ప స్వాములు భక్తి పాటలతో నృత్యాలు, భజనలు చేస్తూ రంగులతో పంబ అరట్టును ఊరేగింపు నిర్వహించి, అయ్యప్ప స్వామి జలాభిషేకం,జలక్రీడలు కార్యక్రమాన్ని ముగించారు.అనంతరం అయ్యప్ప స్వాములకు గ్రామస్తులందరికీ మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో అయ్యప్ప మాలదారులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

