ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్
సర్పంచ్ అభ్యర్థి కొత్త యాకయ్య
(నమస్తే న్యూస్ దంతాలపల్లి ,డిసెంబర్ 11)
మండలంలోని ఆగాపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొత్త యాకయ్య గురువారం ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు.ఇంటింటి ప్రచారంలో భాగంగా గ్రామాన్ని సందర్శించిన ఆయనకు గ్రామస్థుల నుండి విశేష స్పందన లభిస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన యాకయ్య. వార్డు సభ్యుల అభ్యర్థులు,ముఖ్య నాయకులు,యువజన నాయకులు,కార్యకర్తలు మహిళా నాయకురాల్లతో కలిసి వాడవాడల ప్రతి ఇంటికి తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామ అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం అని అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా అని తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నాకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.ఆగాపేట గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ నాయకత్వంలో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త అంతయ్య,వెంకట్రాములు,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

