ఓటు హక్కు వినియోగంతోనే రాజ్యాంగ ఫలాలు:
స్వాతంత్ర సమరయోధురాలు రంగనాయకమ్మ.
(నమస్తే న్యూస్, డిసెంబర్ 14, చిన్నగూడూరు)
రాజ్యాంగ ఫలాలు ప్రజలకు చేరువ కావాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని స్వతంత్ర సమరయోధురాలు సంకినేని రంగనాయకమ్మ పిలుపునిచ్చారు.రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా, చిన్నగూడూరు మండలం విస్సంపల్లి గ్రామ పంచాయతీలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా చిన్నగూడూరు డీటీ, డ్యూటీ ఎస్సైతో పాటు స్థానిక సిబ్బంది ఆమెను అభినందించారు. ప్రజాస్వామ్యంపై ఆమె చూపిన నిబద్ధత అందరికీ ఆదర్శంగా నిలిచింది.

