పర్వతగిరి సమీపంలో
ఆటో ను ఢీ కొట్టిన ఇసుక ట్రాక్టర్
ఇద్దరికీ తీవ్ర గాయాలు.
(నమస్తే న్యూస్, నవంబర్ 14, మహబూబాబాద్ క్రైమ్)
మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి శివారు గుడుంబా తండా సమీపంలో ఆటోను ఇసుక ట్రాక్టర్ ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మహేష్‌తో పాటు ఐదుగురు మహిళలు గాయపడ్డారు.ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు స్పష్టం చేశారు.గాయపడిన వారిలో రాధ అను మహిళకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు.కాగా నేరెడ గ్రామానికి వెళుతున్న ఆటోలో నేరెడ కస్తూర్బా స్కూల్‌కు వెళ్తున్న ఉపాధ్యాయురాళ్లు మద్దెల సింధూజా, బానోత్ కళావతి, సంపల్లి స్వరూప, వెలుపుకొండ శైలజ, కుంటిగొర్ల రాధ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే కుంటిగొర్ల రాధ పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు ఆమెను మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రి నుండి ఆబులెన్స్‌లో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

