- ఘనంగా జూబ్లీహిల్స్ విజయోత్సవ సంబరాలు
- రేవంత్ రెడ్డి గపాలనకు ప్రజా ఆశీర్వాదం - కాంగ్రెస్ జయకేతనం
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ నవీన్ యాదవ్ గారికి హార్దిక అభినందనలు.
- తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మీద సంతృప్తిగా ఉన్నారు అనడానికి ఈ విజయమే నిదర్శనం.
(నమస్తే న్యూస్ నవంబర్ 14,సూర్యాపేట)
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రెడ్ హౌస్ యందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నమ్మకానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి - సంక్షేమం పథకాలతో ఇంకా ముందుకు సాగుతుంది అని ధీమా వ్యక్తం చేశారు.రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందడంతో ప్రజల సుఖసంతోషాలతో ఉన్నారని, ఎన్నికల సమయంలో కేటీఆర్ హైడ్రా ను బూచీగా చూపి పేరుతో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని, అయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారని, బీజేపీ, బీఆర్ఎస్ మాటలను ప్రజలు పట్టించుకోలేదని అన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడానికి జూబ్లీహిల్స్ ఎన్నిక శుభసూచకమఅని ఈ సందర్భంగా చెప్పారు.ఈ కార్యక్రమంలో పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, మండల,పట్టణ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.



