- నూతన జిల్లా వైద్య అధికారికి శుభాకాంక్షలు తెలిపిన
- తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్యవేదిక ప్రతినిధులు.
- ఆర్ఎంపి పిఎంపి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి.


(నమస్తే న్యూస్ ,రంగారెడ్డి, నవంబర్ 13)
నూతనంగా రంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి (DMHO)గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ లలితాదేవిని తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్యవేదిక ప్రతినిధులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. .ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఉక్కుల అశోక్ మాట్లాడుతూ ఆర్‌ఎంపి–పీఎంపి వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. దీనిపై స్పందించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ లలితాదేవి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వానికి నివేదిస్తానని తెలిపారు.డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉక్కుల అశోక్, జిల్లా కమిటీ నాయకులు సయ్యద్ అబ్దుల్ ఖావీ, సరిత గౌడ్, అశోక్ కుమార్, అనిల్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
